గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ముప్పాళ్ల మండలం దమ్మలపాడు అడ్డురోడ్డు వద్ద ఓ కారు అటుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థులు జగనన్న విద్యా కానుక కోసం పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ముప్పాళ్ల హీహెచ్సీ లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యురాలు రమాదేవి కారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై నజీర్ బేగ్ తెలిపారు.