గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పెదరావూరు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొల్లూరు గ్రామానికి చెందిన గోపికృష్ణ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. గోపికృష్ణ తెనాలి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించినట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది.
ఆరు నెలల వ్యవధిలోనే....