ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి వద్ద ప్రమాదం... ఒకరు మృతి, నలుగురికి గాయాలు - mangalagiri latest news

గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా...నలుగురు గాయపడ్డారు.

accident
accident

By

Published : Jun 27, 2021, 10:56 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో శేషు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి విజయవాడవైపు వెళ్తున్న కారు... బైక్​ని ఢీకొట్టి, అదే వేగంతో వెళ్లి డివైడర్​ పైనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా తాకింది. దీంతో ఆ విద్యుత్ స్తంభం కూలిపోయి మరో కారుపై పడింది. ఈ ఘటనలో రెండు కార్లలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఎన్​ఆర్​ఐ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గుంటూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను విజయవాడలోని రాజ్​భవన్​లో ఫుడ్​సెక్షన్​లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు.

ఇదీ చదవండి:విషాదం: కృష్ణా నదిలో మునిగి.. ముగ్గురు యువకులు మృతి

ABOUT THE AUTHOR

...view details