గుంటూరు జిల్లా గురజాల మండలం మాచర్ల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పాత అంబాపురానికి చెందిన ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు.. పొలం పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది.
బైక్ను ఢీకొట్టిన కారు... ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా గురజాల మండలం మాచర్ల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్ను ఢీకొట్టిన కారు... ఇద్దరు మృతి...
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న అంబటి కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ నడుపుతున్న రామ్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శ్వాస విడిచాడు. అతని భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పిడుగురాళ్ల నుంచి మాచర్లకు కారు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.