Guntur District News: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు.. ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పెనుమాకకు చెందిన సతీష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు... కృష్ణాయపాలెం రహదారిపై కేక్ కట్ చేశారు. వేడుకలు పూర్తయ్యాక రెండు ద్విచక్రవాహనాలపై పెనుమాకకు బయల్దేరారు.
Road accident: గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి - three students died in a road accident
కృష్ణాయపాలెంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
06:08 February 05
కృష్ణాయపాలెంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైకు
ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనం అతివేగంతో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్‌రెడ్డి సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Feb 5, 2022, 9:06 AM IST