గుంటూరు జిల్లా పెదకాకాని వై జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడలోని కస్తూరిబాయిపేటకి చెందిన.. కొల్లిపర గోపికృష్ణ, శిరీష దంపతులు.. అనంతవరప్పాడులోని అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉన్న కుమారుడు, కుమార్తెను తీసుకొని తిరిగివస్తున్నారు. ద్విచక్రవాహనంపై విజయవాడ బయలుదేరుతుండగా ప్రమాదానికి గురయ్యారు. సర్వీసు రోడ్డు నుంచి జాతీయ రహదారిపై ఒక్కసారిగా వచ్చిన లారీ... ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొనడంతో గోపికృష్ణ దంపతులతో పాటు కుమార్తె స్నేహ ధ్రుతి మృతి చెందింది. కుమారుడు లోహిత్ సాయి సురక్షితంగా బయటపడ్డాడు. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా పెదకాకాని వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి