గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామానికి చెందినవారు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని బస్సు ఢీకొని కొల్లు గోపయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇదే వాహనంపై ప్రయాణిస్తున్న ఊటుకూరి వీరనారాయణ తలకు తీవ్ర గాయాలవడంతో బాపట్ల ప్రజా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. కంకటపాలెం నుంచి జమ్ములపాలెంకు కర్మ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రహదారిపై రోడ్డు ప్రమాదం...వ్యక్తి తల, మొండెం వేరు - గుంటూరు జిల్లా
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి తల, మొండెం వేరైన ఘటన బాపట్ల మండలం జమ్ములపాలెం రహదారిపై చోటు చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామస్థులంతా భయబ్రాంతులకు గురయ్యారు.
![రహదారిపై రోడ్డు ప్రమాదం...వ్యక్తి తల, మొండెం వేరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4240693-553-4240693-1566740093346.jpg)
రహదారిపై రోడ్డు ప్రమాదం ...వేరైన తలా మొండెెం
రహదారిపై రోడ్డు ప్రమాదం ...వేరైన తలా మొండెెం