ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - చిలకలూరి పేటలో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

road accident at chilkaluripeta in guntur district
చిలకలూరి పేటలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

By

Published : Aug 16, 2020, 3:05 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఎన్​ఆర్​టీ సెంటర్​లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పురుషోత్తంపట్నానికి చెందిన విడదల రామదూత (40) ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరి ఎన్​ఆర్​టీ సెంటర్ కు వస్తుండగా మలుపు వద్ద లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామదూత.. అక్కడికక్కడే మృతి చెందాడు. చిలకలూరి పేట అర్బన్ ఎస్సై పైడి రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details