కర్నూల్ - గుంటూరు జాతీయ రహదారిపై నాదెండ్ల మండలం సాతులూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొట్టడం వల్ల స్థానిక ఆర్ఎంపీ పోలిశెట్టి కుటుంబరావు (60) దుర్మరణం చెందారు. స్థానిక పాలకేంద్రం కూడలి నుంచి బీసీ కాలనీలోని ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే వైద్యుడు మృతి చెందాడు. అతనికి భార్య సుబ్బాయమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాదెండ్ల ఇంఛార్జ్ ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఆర్ఎంపీ మృతి - guntur district latest news
సాతలూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యుడు పోలిశెట్టి కుటుంబరావు మృతి చెందాడు.
![జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఆర్ఎంపీ మృతి rmp doctor in a road accident in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8174006-992-8174006-1595699589741.jpg)
సాతలూరు వద్ద రోడ్డు ప్రమాదం