మట్కా నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను, పేకాట ఆడుతున్న అయిదుగురిని గుంటూరు జిల్లా పొన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ టీం... మట్కా స్థావరాలపై దాడులు చేసింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 6,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంగణంలో తనిఖీలు చేయగా పేకాట ఆడుతున్న అయిదుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9,100 నగదును సీజ్ చేశారు.
మట్కా, పేకాట స్థావరాలపై పోలీసు దాడులు... నగదు స్వాధీనం - పొన్నూరులో పోలీసు తనిఖీలు
గుంటూరు జిల్లా పొన్నూరులో మట్కా, పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు