ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల ముందుకే బియ్యం.. కళ్ల ఎదుటే తూకం - ఏపీలో ఇంటికే రేషన్ పంపిణీ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి మొబైల్‌ వాహనాల ద్వారా గడప వద్దకే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవినీతికి అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు సీఎం తెలిపారు.

ration home delivery
ration home delivery

By

Published : May 8, 2020, 8:47 PM IST

Updated : May 9, 2020, 6:54 AM IST

నాణ్యమైన బియ్యాన్ని సెప్టెంబరు 1 నుంచి రేషన్‌ కార్డుదారుల ఇళ్లకే తీసుకెళ్లి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రావాలని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 సమీక్షలో భాగంగా శుక్రవారం రేషన్‌ పంపిణీపై సీఎం సమీక్షించారు. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకత లక్ష్యంగా పథకాన్ని చేపట్టినట్లు జగన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గతేడాది సెప్టెంబరు 6న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. అమలులో లోటుపాట్లను పరిశీలించడంతోపాటు కార్డుదారుల అభిప్రాయాలను స్వీకరించి పటిష్ఠ విధానాన్ని రూపొందించామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ప్రతి నెలా 2.3 లక్షల టన్నుల బియ్యాన్ని ఇస్తామన్నారు.

13,370 వాహనాల ద్వారా


గోదాముల నుంచి వచ్చే ప్రతి బస్తాపైనా సీలు, బార్‌కోడ్‌ ఉంటుందని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ఈ సందర్భంగా తెలిపారు. లబ్ధిదారులకు నాణ్యమైన సంచులు ఉచితంగా ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కల్తీ, రవాణాలో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 13,370 మొబైల్‌ వాహనాలను అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నాం. అందులోనే ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రం ఉంటుంది. వీటి ద్వారా ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి బియ్యాన్ని అందిస్తాం. వారి ముందే బస్తా సీలు తెరచి నిర్దేశించిన కోటా ప్రకారం పంపిణీ చేస్తాం’ అని తెలిపారు.

ఇదీ చదవండి

సచివాలయాల్లో 16 వేలకు పైగా పోస్టులు ఖాళీ

Last Updated : May 9, 2020, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details