కరోనా కారణంగా.. ఆర్థికంగా కుంగిపోతున్న నాట్య కళాకారులకు గుంటూరు జిల్లా తెనాలిలో దాతలు అండగా నిలిచారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. పట్టణంలోని ఉప్పు బజారుకు చెందిన 'శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస్ నాట్యమండలి' నిర్వాహకుడు దీపాల సుబ్రహ్మణ్యం, కళాకారుడు సనిశెట్టి సాంబశివరావు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
కళాకారుల పరిస్థితుల దృష్ట్యా ఇరవై మందికి.. ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం బస్తాలను అందించారు. సాంబశివరావు ఇప్పటికే.. వేర్వేరు సంఘాలల్లోని 200 మంది కళాకారులకు బియ్యం వితరణ చేశారు.