ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరుదైన వరి రకం పైరు నాశనం.. యువ రైతు ఆవేదన - govinda namala rice crop latest news

గోవిందా నామాల ఆకారంలో.. దేశవాళీ వరి వంగడాల సాగు చేసిన పైరును గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేశారు. రసాయనాలు చల్లి.. పంటను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అందరికీ ఉపయోగపడే ఇలాంటి పంటను నాశనం చేయడం సరికాదని బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

rice crop destroyed
వరి పైరు నాశనం

By

Published : Sep 2, 2020, 4:15 PM IST

యువ రైతు ఆవేదన

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తకోటలో ఆకతాయిలు రెచ్చిపోయీరు. ఏపుగా పెరిగిన వరినారును నాశనం చేశారు. గ్రామానికి చెందిన యువ రైతు బాపారావు ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. పలు రకాల వరి వంగడాలతో ప్రయోగం చేశారు. కొద్ది రోజుల క్రితం తన పొలంలో గోవింద నామాల ఆకృతిలో వరినారు వేశారు. ఈ పైరుపై మీడియాలో బాగా ప్రచారం జరిగింది.

ఈ వరి పైరును గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు చల్లి పాడు చేశారు. తాను ఎంతో శ్రమించి.. జాగ్రత్తగా కాపాడుకుంటున్న అరుదైన దేశవాళీ వరి రకం నారు పాడైపోవటంపై యువ రైతు తల్లడిల్లారు. ఈ రకం వరి విత్తనం కోసం ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నారనీ.. ఇలా నాశనం చేయటం వలన వారికి ఏమెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరినారును నాశనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

ఇంద్రాణి అనే వరి రకానికి చెందిన పైరు ఇది. ఈ పైరుపై గుర్తుతెలియని వ్యక్తులు విష రసాయనాలు వేసి మాడిపోయేలా చేశారు. ఈ విత్తనం కోసం ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి చర్యలు సరికాదు- బాపారావు, యువరైతు

ABOUT THE AUTHOR

...view details