ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూములు సొసైటీకే ఇస్తూ ఉత్తర్వులు జారీ - గుంటూరు జిల్లాలో సొసైటీ భూముల వివాదం తాజా వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం య‌డ‌వ‌ల్లి సొసైటీ ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ రివిజ‌న్ అథారిటీ తీర్పు ఇచ్చింది. ‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ లిమిటెడ్’’ రికార్డుల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేదంటూ గ‌త ప్ర‌భుత్వంలో ఈ సొసైటీని ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాద‌ని గురువారం రివిజ‌న్ అథారిటీ తీర్పు ఇచ్చింది. గెలిచిన ఏడు నెల‌ల్లోనే య‌డ‌వ‌ల్లి బాధిత రైతుల‌కు న్యాయం చేయ‌గ‌లిగామ‌ని ఎమ్మెల్యే సంతోషం వ్య‌క్తం చేశారు.

Revision Authority Issuing orders
గుంటూరులో సొసైటీ భూములు సొసైటీకే ఇస్తూ ఉత్తర్వులు జారీ

By

Published : Feb 14, 2020, 3:36 PM IST

గుంటూరులో సొసైటీ భూములు సొసైటీకే ఇస్తూ ఉత్తర్వులు జారీ

1975లో అప్పటి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని 250 మంది నిరుపేద ఎస్సీ ఎస్టీలకు సర్వే నంబర్ 381లో 416.50 ఎకరాల భూమిని కేటాయించింది.‘‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ లిమిటెడ్’’ పేరుతో అప్పట్లో ఎస్సీ ఎస్టీలు ఒక సొసైటీగా ఏర్పడగా.. ఏక పట్టాగా వారికి భూములు అందజేశారు. 2015లో వాటిని ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. అప్పట్లో పాదయాత్రకు వచ్చిన వైఎస్ జగన్​కు రైతులు వినతి పత్రం అందజేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు సొసైటీకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పేదలకే భూములు చెందేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే రజిని తెలిపారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సొసైటీ భూములు కాజేయాలని చూశారని ఆమె విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details