ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోలు సమస్యలు, గిట్టుబాటు ధర కల్పించటంపై గుంటూరులో మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహించారు. పత్తి విక్రయాల్లో ఎదురవుతున్న సమస్యలపై రైతులతో మాట్లాడారు. పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ-క్రాప్‌లో రైతుల పేర్లు లేకపోవటం కారణంగా సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులు కూడా వ్యవసాయ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని ఈక్రాప్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. బయటి మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నందున... గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
పత్తి విక్రయంపై మార్కెటింగ్ శాఖ కమిషనర్ సమీక్ష - cotton crop review meeting in guntur news
పత్తి రైతులు పంటను విక్రయించుకునేందుకు వీలుగా... ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సూచించారు.

పత్తి రైతులతో మార్కెటింగ్ శాఖ కమిషనర్ సమీక్ష సమావేశం