ప్రసూతి మరణాలను తగ్గించేందుకు వైద్యారోగ్య సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై గుంటూరులో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మూడు నెలలుగా జరిగిన మాతృమరణాలు, వాటికి గల కారణాలను విశ్లేషించారు. మానవ తప్పిదాలు, సదుపాయాల లోపాలు, సకాలంలో స్పందించకపోవటం వంటి వాటిలో ఎలాంటి లోపాల వల్ల మరణాలు నమోదవుతున్నాయో చర్చించారు.
ప్రసూతి మరణాలపై గుంటూరులో సమీక్షా సమావేశం
ప్రసూతి మరణాలను తగ్గించేందుకు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై గుంటూరులో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మరణాలకు కారణాలు, వైద్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.
ప్రసూతి మరణాలపై సమీక్షా సమావేశం
ప్రసూతి మరణాలకు పన్నెండు కారణాలను గుర్తించిన కమిటీ... అందులో రెండింటిని నివారించదగినవని అభిప్రాయపడింది. భవిష్యత్తులో అలాంటి మరణాలు నమోదు కాకుండా వైద్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది.