కొవిడ్-19ను అరికట్టేందుకు చేపడుతున్న లాక్డౌన్లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం కష్టపడి పనిచేస్తుందని.. తమను ప్రొత్సహిస్తే మరింత పనిచేస్తామని ఉద్యోగులు మంత్రి మోపిదేవి వెంకటరమణరావుకు విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో సర్వే, రేషన్ పంపిణీలో, రెడ్‌జోన్‌లలో ఇలా అనేక రకాలుగా రెవెన్యూశాఖ అధికారులు, ఉద్యోగులను గుర్తించాలని కోరారు. వేతనాల విషయంలో తమకు ఇబ్బందులున్నా ఫర్వాలేదని.. వైద్యం, మున్సిపల్, పోలీసులతో పాటు తమను గుర్తించి ప్రొత్సహించాలని, తమకు కూడా డ్రస్‌కోడ్ ఇవ్వాలని విన్నవించారు.
'రెవెన్యూ అధికారులను గుర్తించి ప్రోత్సహించాలి' - lockdown
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. పలు శాఖల అధికారులు అత్యవసర సేవలందిస్తున్నారు. ఈ పరిస్థితిలో రెవెన్యూ శాఖ కూడా కష్టపడి పనిచేస్తుందని, తమను గుర్తించి ప్రోత్సహించాలని ఉద్యోగులు మంత్రి మోపిదేవిని కోరారు.
మోపీదేవికి వినతి పత్రం అందజేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు