గుంటూరు అర్బన్ పరిధిలో పెట్రోల్ విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ద్విచక్రవాహనాలకు అర లీటర్, కార్లకు మూడు లీటర్లకు మించి ఇంధనాన్ని విక్రయించవద్దని పెట్రోలు బంక్ యజమానులను ఆదేశించారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు వాహనాలతో రోడ్లపైకి వస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఇప్పటికే 1600ల కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. దీనిని కట్టడి చేసేందుకు ఇంధన విక్రయాల్లో కోత విధిస్తున్నామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ఈ నిబంధనపై వాహనదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా పెట్రోల్ బంకు యజమానులు ఆంక్షలు అమలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
గుంటూరు అర్బన్‌లో పెట్రోల్ విక్రయాలపై ఆంక్షలు - lockdown in Guntur
లాక్డౌన్లో రోడ్లపై వాహనాల సంచారం తగ్గించేందుకు గుంటూరు అర్బన్ పోలీసులు వినూత్న నిబంధనను తెరపైకి తెచ్చారు. వాహనదారులకు పెట్రోల్ పోసే పరిమాణాన్ని తగ్గించాలని బంకు యజమానులను ఆదేశించారు. ఫలితంగా నగరంలో వాహనాల రాకపోకలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుంటూరు అర్బన్‌లో పెట్రోల్ విక్రయాలపై ఆంక్షలు