గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ఈటీవీలో కథనం ప్రసారమైంది. దీనిపై 24 గంటల్లోనే అధికారులు స్పందించారు. హుటాహుటిన రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు ఛిద్రమయ్యాయి. గుంతలు ఏర్పడి, నీరు నిలిచి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈటీవీ కథనానికి స్పందించి వెంటనే రోడ్లు బాగు చేసిన అధికారులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.
24 గంటల్లో స్పందన.. రోడ్లపై గుంతలు పూడ్చిన అధికారులు - ఈటీవీ కథనానికి స్పందన
ఈటీవీ కథనంపై అధికారులు 24 గంటల్లో స్పందించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రోడ్లపై గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. దీనిపై ఈటీవీలో కథనం రాగానే.. అధికారులు స్పందించి గుంతలు పూడ్చారు.
24 గంటల్లో స్పందన.. రోడ్లపై గుంతలు పూడ్చిన అధికారులు