నేటి నుంచి 1184 వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు - రాష్ట్రంలో వైద్యుల పోస్టుల భర్తీ వార్తలు
కొవిడ్-19 అవసరాల కోసం 1184 వైద్యుల పోస్టులను ఒప్పంద విధానంలో వైద్యారోగ్యశాఖ భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 19తో ముగియనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కొవిడ్-19 అవసరాల కోసం 1184 వైద్యుల పోస్టులను ఒప్పంద విధానంలో వైద్యారోగ్యశాఖ భర్తీ చేయనుంది. బోధనాసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసేందుకు 400 జనరల్ మెడిసిన్, పల్మనాలజిస్టు, 192 మత్తుమందు వైద్య నిపుణుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హతతో 592 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషలిస్టులకు నెలకు రూ.లక్ష 10వేలు , ఎంబీబీఎస్ వైద్యులకు రూ.53వేల 945 వేతనం కింద అందజేస్తారు. భవిష్యత్తులో జరిగే శాశ్వత నియామకాల్లో 15% ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 19తో ముగియనుంది. పూర్తి వివరాలు ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంచారు.