Repalle TDP MLA Anagani Satya Prasad: చంద్రబాబు-పవన్ కల్యాణ్ కాఫీకి కలిస్తేనే 12మంది మంత్రులు భయపడిపోతూ స్పందించారని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇద్దరు కలవకూడదని జీవో నెంబర్ 2 ఏమైనా తెస్తారా అంటూ మండిపడ్డారు. నిన్న బయటకు వచ్చిన మంత్రులు తమకు అప్పగించిన శాఖల్లో పురోగతిపై ఎప్పుడైనా స్పందించారా నిలదీశారు. రేపు ఇద్దరు నేతలూ భోజనానికి కలిస్తే ఈ మంత్రులంతా ఏమైపోతారో అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల ముందు మెడలు వంచుతామని గొప్పలు పోయిన వారిది మెడలు, కాళ్ళు వంచుకునే పరిస్థితి అని విమర్శించారు. రాక్షసుడుని అంతం చేసేందుకు వివిధ పక్షాలు కలిసి పోరాడటంలో తప్పు లేదని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
ఆ ఇద్దరూ భోజనానికి కలిస్తే.. మంత్రులంతా ఏమైపోతారో: అనగాని సత్యప్రసాద్ - వైసీపీ మంత్రులపై అనగాని సత్యప్రసాద్ ఆరోపణలు
TDP MLA Anagani Satya Prasad: చంద్రబాబు-పవన్ కలిసి కాఫీ తాగితేనే.. రాష్ట్రంలో 12 మంది మంత్రులు స్పందించారంటే వైకాపా ఎంతగా భయపడుతోందో అర్థమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆ ఇద్దరూ కలవకూడదని జీవో నెంబర్-2 ఏమైనా తెస్తారేమోనంటూ ఎద్దేవా చేశారు. తమ శాఖల పురోగతి గురించి ఏనాడు మాట్లాడని మంత్రులంతా, చంద్రబాబు పవన్ భేటీపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారన్నారు.
'పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై మాట్లాడేందుకు.. మర్యాదపూర్వకంగా కాఫీకి కలిస్తే, 12మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చారు. ఇలా మంత్రులు తమ శాఖలపై ఎప్పడైనా స్పందించారా..? రేపు భోజనానికి ఇద్దరూ కలిస్తే వీరంతా ఏమైపోతారో.. చంద్రబాబు-పవన్ రాష్ట్రంలో అరాచక పాలనపై ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై మాట్లాడుకున్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 తీసుకువచ్చి ప్రతిపక్షాలకు సంకెళ్లు వేయాలని చూస్తున్నారు కనుక వారిపై ఎలా పోరాడాలి అనే అంశాన్ని చర్చించారు'-. అనగాని సత్యప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే
ఇవీ చదవండి: