గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయ సారథి అన్నారు. గతంలో పట్టణంలో తాగునీటి ఇబ్బందులున్నాయని... తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రోజు తాగునీరు అందిస్తున్నామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజి కాలువల్లో ఎప్పటికపుడు మురుగు పారేలా పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య ఉన్నట్లు తమకు సమాచారం వస్తే వెంటనే అధికారులను పంపి పరిష్కరిస్తున్నామన్నారు. కార్యాలయంలో ఎవరైనా లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
'ఎవరైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి' - repalli
తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తెనాలిలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయని మున్సిపల్ కమిషనర్ విజయ సారథి అన్నారు.

రేపల్లె మున్సిపల్ కమిషనర్
Last Updated : Aug 2, 2019, 5:31 PM IST