బ్లీచింగ్ పౌడర్ నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. గుంటూరు సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ మంగళవారం పరారయ్యాడు. మంగళగిరికి చెందిన రౌడీ షీటర్ ఆల సుబ్బారావు(40)ను పోలీసులు.. పోక్సో కేసులో అరెస్టు చేశారు. గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సుబ్బారావు ఈనెల 15న బ్లీచింగ్ పౌడర్‌ను నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సిబ్బంది హుటాహుటిన సర్వజనాసుపత్రికి తరలించగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం వార్డులో ఉన్న భద్రత సిబ్బంది కళ్లుగప్పి పారిపోవడంపై.. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు అందింది.
ముగ్గురు పోలీసులపై వేటు
రిమాండ్ ఖైదీ పరారైన ఘటనను ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించారు. ముగ్గురు పోలీసులపై వేటేశారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రిమాండ్ ఖైదీకి జాగ్రత్తగా కాపలా ఉండాల్సిన క్రమంలో అతను తప్పించుకొని పారిపోవడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఖైదీకి సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఏఆర్ హెచ్‌సీలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, గుంటూరు ట్రాఫిక్ విభాగ కానిస్టేబుల్ కిరణ్‌బాబులను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:
Flash: మాజీ మంత్రి దేవినేని వర్గీయులపై రాళ్ల దాడి