ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెనాలిలో రిమాండ్​ ఖైదీ మృతిపై సబ్​ కలెక్టర్ విచారణ

By

Published : Jun 17, 2020, 7:38 PM IST

ఓ మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రిమాండ్ ఖైదీ గుంటూరు జిల్లా తెనాలి సబ్​జైలులో మృతి చెందాడు. ఖైదీ మృతిపై ఆయన కుమారుడు అనుమానం వ్యక్తం చేయడంతో... మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. ఖైదీ మృతిపై సబ్​ కలెక్టర్​ దినేష్​ కుమార్​ విచారణ ప్రారంభించారు. వైద్యులు, పోలీసులు, జైలు అధికారుల నుంచి సమాచారం సేకరించిన ఆయన... కలెక్టర్​కు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు.

రిమాండ్​ ఖైదీ మృతిపై సబ్​ కలెక్టర్ విచారణ
రిమాండ్​ ఖైదీ మృతిపై సబ్​ కలెక్టర్ విచారణ

గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ వీరశంకర్రావు మృతిపై సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ విచారణ జరిపారు. తెనాలి ఆసుపత్రికి వచ్చిన ఆయన మార్చురిలో ఉన్న మృతదేహాన్నిపరిశీలించారు. మృతదేహం పరిస్థితి, వైద్యులు, జైలు అధికారులు, పోలీసుల నుంచి సమాచారం సేకరించారు. ఈ ఘటనపై కలెక్టర్​కు నివేదిక ఇవ్వనున్నట్లు దినేష్ కుమార్ తెలిపారు. వీరశంకర్రావు మృతిపై ఆయన కుమారుడు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. అక్కడి వైద్యులతో శవపరీక్ష జరిపి కారణాలు తెలుసుకుంటామన్నారు. ఆ నివేదిక ఆధారంగా అనుమానాలపై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామన్నారు. ఓ మహిళ హత్య కేసులో నిందితునిగా ఉన్న వీరశంకర్రావు బుధవారం మరణించారు.

ABOUT THE AUTHOR

...view details