గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీ మరణించిన ఘటన వివాదానికి దారితీస్తోంది. తెనాలి సబ్ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ వీర శంకర్ రావు ఈరోజు మృతి చెందారు. గుండెపోటు రావటంతో తెనాలి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం కొల్లిపొర మండలం చక్రాయపాలెంలో జరిగిన మహిళ హత్య కేసులో వీర శంకర్ రావు ప్రధాన నిందితుడు. అతడిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అతడిని పోలీసులు తెనాలి సబ్ జైలుకు తరలించారు. ఇవాళ ఉదయం వీర శంకర్ రావు మరణించాడు. అయితే తన తండ్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అతని కుమారుడు రాంబాబు తెలిపారు. తమ గ్రామానికి చెందిన కొందరు జైలు అధికారులతో కలిసి తన తండ్రిని చంపారని ఆరోపించారు. గొంతుపై గాయాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
గుంటూరు జిల్లా కొల్లిపొర మండలం చక్రాయపాలెంలో జరిగిన మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీర శంకర్ రావు ఈరోజు గుండెపోటుతో మృతిచెందాడు. అయితే తన తండ్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పోలీసులే చంపారని అతని కుమారుడు రాంబాబు అనుమానం వ్యక్తం చేశాడు.
remand khadhi died in guntur dst thenali