ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతలకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

పులిచింతల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత 44.43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2 లక్షల 23 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2 లక్షల 67 వేల క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కులు కేటాయించారు.

Release of water from the pulichinthla reservoir
పులిచింతల జలాశయం నుంచి నీరు విడుదల

By

Published : Oct 13, 2020, 9:59 AM IST

Updated : Oct 13, 2020, 10:36 AM IST

నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలతో పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2 లక్షల 23 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2 లక్షల 67 వేల క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కులు కేటాయించారు.

ప్రస్తుతం 44.43 టీఎంసీల నిల్వ..

పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత 44.43 టీఎంసీల నీరు ఉన్నట్లు వివరించారు. నాగార్జున సాగర్ నుంచి విడుదలైన నీటితో పాటు... పులిచింతల ఎగువ ప్రాంతాల్లో కురిన వర్షం కారణంగానూ నీరు వస్తోంది. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి:నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం

Last Updated : Oct 13, 2020, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details