అమరావతిలోనే రాజధాని ఉండాలని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గత 21 రోజులుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం భయపడి పోలీసులతో అడ్దుకుంటుందని ...అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, నిరసన తెలియజేసే హక్కులను కాలరాస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. 30 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించిన సీఎం జగన్ ఐదేళ్లు ఉండటం కష్టమని ..జమిలి ఎన్నికలు వస్తే మూడేళ్లకే ముగించాల్సి ఉంటుందన్నారు.
జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: ప్రత్తిపాటి