కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తరువాత 60 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని ఆరోపిస్తూ..మృతుని బంధువులు ఆందోళకు దిగారు. ఈ సంఘన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో జరిగింది.
60 ఏళ్ల వృద్ధుడు మృతి.. బంధువుల ఆందోళన - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు(60) రెండు రోజుల క్రితం కరోనా టీకా వేయించుకున్నాడు. కాగా శుక్రవారం ఆయాసంగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా గుండెపోటుతో ఈరోజు ఉదయం ఆయన చనిపోయాడు. అయితే కరోనా టీకా వికటించడం వల్లే వృద్ధుడు చనిపోయాడని..మృతుని కుటంబ సభ్యులు ఆరోపించారు.
చినకాకానికి చెందిన గండికోట మల్లిఖార్జున రావు(60) అనే వృద్ధుడు రెండు రోజుల క్రింత కొవిడ్ టీకా వేయించున్నాడు. అయితే శుక్రవారం ఉదయం ఆయాసంగా ఉందని చెప్పటంతో కుటుంబ సభ్యులు అతడిని జీజీహెచ్‌కు తరలించారు. ఇవాళ ఉదయం అతను గుండెపోటుతో మరణించాడు. అయితే కొవిడ్ టీకా వికటించటం వల్లే మల్లిఖార్జున రావు మరణించారంటూ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. ఆరోగ్య కేంద్రం వద్ద మృతదేహం ఉంచి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.