గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చేబ్రోలు మండలం మంచాల ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన ఇద్దరు తెదేపా అభ్యర్థుల నామినేషన్లతో పాటు పెదకాకాని-3కి పోటీ చేసిన వైకాపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. మంచాలకు పోటీ చేసిన యకసిరి పద్మ, యకసిరి అనమ్మలకు ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. పెదకాకానికి పోటీ చేసిన బత్తుల వీరకుమారి నామపత్రాలను అసంపూర్తిగా పూరించటం వల్ల ఆమె నామినేషన్ను కూడా తిరస్కరించారు. సరైన పత్రాలు సమర్పించేందుకు తమకు 5 గంటల వరకు సమయమివ్వాలని అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
పొన్నూరు నియోజకవర్గంలో 3 నామినేషన్లు తిరస్కరణ - పొన్నూరులోనామినేషన్లు తిరస్కరణ
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెదేపాకు చెందిన ఇద్దరు అభ్యర్థులతో పాటు వైకాపాకు చెందిన మరో అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
నామినేషన్లు తిరస్కరణ