గుంటూరు జిల్లా రేపల్లెలో కొవిడ్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. మరో వైపు స్థానికంగా ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద క్రయవిక్రయదారులు అధికంగా వస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా రిజిస్ట్రేషన్ ల కొరకు వేచి చూస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సమయపాలన పాటించకుండా... ఆలస్యంగా వస్తుండటంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు వేచి చూడక తప్పడం లేదు.
క్రయ విక్రయదారులు గుంపులు గుంపులుగా ఉంటున్నా.. అధికారులు మాత్రం కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని.. లేకపోతే కొవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు.పట్టణంలో ఇప్పటికే సుమారు 500 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.