గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో... దక్షిణ భారతదేశ ప్రాంతీయ స్థాయి నవోదయాల బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. తెలుగు రాష్ట్రాలతో సహ కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ నవోదయాల నుంచి 150 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలు ఆసక్తికరంగా సాగాయి. గుంటూరు నవోదయ క్రీడాకారులు రెజ్లింగ్ పోటీల్లో ఛాంపియన్‌ను కైవసం చేసుకున్నారు. బాక్సింగ్ పోటీల్లో ప్రకాశం-1 నవోదయ క్రీడాకారులు ఛాంపియన్ గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించి బంగారు పతకాలు సాధిస్తామని క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ క్రీడలకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
హోరాహోరీగా బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు
చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. క్రీడాకారులంతా తమదైన శైలిలో రాణించారు.
హోరాహోరీగా సాగిన నవోదయా బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు
TAGGED:
బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు