కృష్ణా జిల్లా గూడూరులో చమురు నిక్షేపాల వెలికితీత కోసం బావులు తవ్వుటకు 25 ఎకరాల చొప్పున మొత్తం 1000 ఎకరాల భూమిని తీసుకునేందుకు... ప్రభుత్వం వేదాంత లిమిటెడ్ కంపెనీ తరుపున ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం మొవ్వ, గూడూరు, బందరు, కలిదిండి మండలాల్లోని 35 గ్రామాల్లో చమురు నిక్షేపాల వెలికితీత కోసం బావులు తవ్వేందుకు 25 ఎకరాల చొప్పున మొత్తం 1000 ఎకరాల భూమిని తీసుకోనుంది.
'రైతులపై చమురు కుంపట్లు వద్దే వద్దు' - Oil deposits in Krishna district
చమురు నిక్షేపాల కోసం వ్యవసాయ భూముల్లో తవ్వకాలు జరిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నిరసన తెలియచేస్తామని సీపీఎం నేత రఘు తెలిపారు. రైతులపై చమురు కుంపట్లు వద్దే వద్దు అంటూ కృష్ణాజిల్లా మొవ్వ మండలం కాజా గ్రామంలో సీపీఎం పార్టీ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించింది.
ఈనెల 17న తరకటూరు హైస్కూల్లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను ఆపాలని సీపీఎం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ తవ్వకాల ద్వారా కలిగే ఇబ్బందులపై రైతులకు అవగాహన కల్పించారు. అభివృద్ధి పేరుతో పచ్చని పొలాలను బీడు భూములుగా మార్చొద్దన్నారు. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ప్రజలకు నీరు తాగడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోరాలన్నారు. అంతేకానీ పచ్చని ప్రదేశాలలో ఈ రకమైన పర్యావరణానికి హాని కలిగించే సహజ వాయువుల వెలికితీత చేయటం దారుణమన్నారు. ఇందుకు తాము శాంతియుతంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం నేత రఘు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి