ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో రెడ్​జోన్ ప్రాంతాల పరిధి తగ్గింపు - నరసరావుపేటలో రెడ్​జోన్స్

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెడ్​జోన్​ నుంచి గ్రీన్​జోన్​గా కొన్ని ప్రాంతాలు మార్చుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా రెడ్ జోన్​ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

red zones turned to green zones in narasaraopeta
నరసరావుపేటలో రెడ్​జోన్ ప్రాంతాల పరిధి తగ్గింపు

By

Published : Jun 1, 2020, 5:49 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెడ్​జోన్​ ప్రాంతాల పరిధిని తగ్గిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపటినుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు లాక్​డౌన్ సడలింపులు ఉంటాయని తెలిపారు. రెస్టారెంట్లు, తోపుడు బండ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతులు ఇచ్చిన దుకాణాల్లో శానిటైజర్, మాస్కులు వాడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.

గ్రీన్​జోన్​గా ఉండే ప్రాంతాలు:

రామిరెడ్డిపేట, ఇస్లాంపేట, పెద్దచెరువు, ఎన్జీవో కాలనీ.

రెడ్​ జోన్​ నుంచి గ్రీన్​జోన్​గా మారే ప్రాంతాలు:

నిమ్మతోట, ప్రకాశ్​నగర్ 14వ వార్డు.

ఇదీ చదవండి:వైకాపా దాడులు శ్రుతిమించిపోయాయి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details