ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట ప్రజలను డోర్​ దాటనీయని డ్రోన్​ - CORONA UPDATES OF NARSARAO PETA

నరసరావుపేట రెడ్ జోన్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితులు పరిశీలించనున్నారు. ప్రజలు బయటకు వస్తే గుర్తించి వారిని వెంటనే ఇళ్లలోని పంపాలని రూరల్ ఎస్పీ విజయరావు అధికారులకు సూచించారు.

CORONA CASES IN NARSARAO PETA
డ్రోన్ కెమెరా పరిశీలిస్తున్న రూరల్ ఎస్పీ విజయరావు

By

Published : May 8, 2020, 10:43 AM IST

నరసరావుపేటలో రోజు రోజకూ కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నరసరావుపేటలోని రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో బందోబస్తు పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన డ్రోన్‌ కెమెరాల పనితీరును రూరల్‌ ఎస్పీ విజయరావు పరిశీలించారు. ప్రజలు బయటకు వస్తే కెమెరాలతో గుర్తించి వెంటనే సిబ్బందిని అక్కడకు పంపించి.. వారిని ఇళ్లలోకి పంపాలని అధికారులకు సూచించారు. బందోబస్తును పర్యవేక్షిస్తున్న అదనపు ఎస్పీ చక్రవర్తి, డీఎస్పీ వీరారెడ్డి, ఎస్‌బీ సీఐ బాలమురళీకృష్ణతో కలిసి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుపై సమీక్ష జరిపారు.

ABOUT THE AUTHOR

...view details