ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసారావుపేట రెడ్ జోన్​లో ఎస్పీ పర్యటన - నరసారావుపేటలో రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించిన గుంటూరు రూరల్ ఎస్పీ

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కరోనా రెడ్ జోన్ ప్రాంతాలను గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు పరిశీలించారు. టీబీ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి మృతి చెందగా.. అతనికి పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనా నిర్థరణ అయ్యింది. మృతి చెందిన వ్యక్తి కేబుల్ ఆపరేటర్ అని గుర్తించి.. గత నెల 10వ తేదీ నుంచి అతను ఎవరెవరిని కలిశాడో ఆరా తీసి వారి వివరాలు ఉన్నతాధికారులకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ చెప్పారు.

red zone areas are inspected by guntur rural sp at narsaraopeta
నరసారావుపేటలో రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించిన గుంటూరు రూరల్ ఎస్పీ

By

Published : Apr 10, 2020, 7:37 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కరోనా రెడ్ జోన్ ప్రాంతాలను గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు పరిశీలించారు. కొద్దిరోజుల క్రితం టీబీ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి మృతి చెందగా.. అతనికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు చెప్పారు. కేబుల్ ఆపరేటర్ గా పని చేసిన అతను.. ఇన్నాళ్లూ ఎవరిని కలిశాడన్నది ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఆ వివరాలు నిర్థరించుకున్నాక.. ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. అతను నివసించిన వరవకట్ట, ఉద్యోగ రీత్యా తిరిగే రామిరెడ్డిపేట ప్రాంతాలను రెడ్ జోన్​గా ప్రకటించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా పోలీసులు నిర్వహిస్తున్న బందోబస్తులను ఎస్పీ పర్యవేక్షించారు. ఈ ప్రాంతం నుంచి పరీక్షల నిమిత్తం 28 మందిని క్వారంటైన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details