ఎంపీపీ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా... గుంటూరు జిల్లా వినుకొండ మండలం వితంరాజుపల్లిలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రికార్డింగ్ డాన్సులు, డీజేలు, బాణాసంచాలతో హోరెత్తించారు. రికార్డింగ్ డాన్సర్లు స్టేజి మీద చిందులు వేస్తూ ఎమ్మెల్యే, నేతలకు స్వాగతం పలికారు.
RECORDING DANCE : ఎంపీపీ ప్రమాణస్వీకారంలో రికార్డింగ్ డ్యాన్సులు - MPP swearing secemany in vithamrajupall
గుంటూరు జిల్లా వితంరాజుపల్లిలో ఎంపీపీ ప్రమాణస్వీకారం సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
వితంరాజుపల్లిలో ప్రమాణ స్వీకారం
అధికార బలంతో నిబంధనలకు విరుద్ధంగా రికార్డింగ్ డాన్స్లు వేయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు, నిరసనలు, ప్రదర్శనలు చేయడానికి వీలు లేదని... నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న అధికారులకు రికార్డింగ్ డాన్సులు, డీజేలు, ఆర్భాటపు బహిరంగ సభలు కనపడటం లేదా చర్చించుకుంటున్నారు.
ఇదీచదవండి.