మహాశివరాత్రి నాడు ఆ త్రినేత్రుడికి వేడుకగా ఉత్సవాలు జరుపుతారు. రాత్రంతా ఆ గరళకంఠుడిని స్మరిస్తూ జాగారం చేస్తారు. కానీ గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో శివరాత్రి వేడుకల్లో అమ్మాయిలతో రికార్డింగ్ డాన్సులు చేయించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ట్రాక్టర్‌పై నృత్యాలు చేయిస్తూ.. ఊరూరా తిప్పారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారని పలువురంటున్నారు.
శివరాత్రి ఉత్సవాల్లో అశ్లీల ప్రదర్శనలు - శివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులు
మహాశివరాత్రి పర్వదినాన వాడవాడలా ఆ పరమేశ్వరున్ని స్మరించుకుంటూ జాగారం చేస్తుంటారు భక్తులు. కానీ ఆ పవిత్రకు కళంకం తెచ్చిపెట్టారు ఓ ఊరి ప్రజలు. శివరాత్రి వేడుకల్లో అమ్మాయిలతో రికార్డింగ్ డాన్సులు చేయించి..ఇదేమి భక్తి అని అందరూ అనుకునేలా ప్రవర్తించారు.
![శివరాత్రి ఉత్సవాల్లో అశ్లీల ప్రదర్శనలు recording dance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10975994-199-10975994-1615535219204.jpg)
శివరాత్రి ఉత్సవాల్లో అశ్లీల ప్రదర్శనలు..