ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు మిర్చి యార్డు రికార్డ్... ఒక్కరోజే లక్షా 80వేలకు పైగా టిక్కీలు! - guntur mirchi yard record

గుంటూరు మిర్చి యార్డుకు రికార్డు స్థాయిలో మిర్చి వచ్చింది. ఒక్కరోజే లక్షా 80 వేలకు పైగా టిక్కీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

guntur mirchi yard record
గుంటూరు మిర్చి యార్డు

By

Published : Apr 6, 2021, 4:32 PM IST

గుంటూరు మిర్చి యార్డు రికార్డ్

గుంటూరు మిర్చియార్డు మిరప బస్తాలతో ఎరుపెక్కింది. రికార్డు స్థాయిలో రైతులు మిర్చి పంటను తీసుకువచ్చారు. లక్షా 80 వేలకు పైగా టిక్కీలు యార్డుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజులు వరుస సెలవులు వచ్చిన కారణంగా.. కార్యకలాపాలు జరగలేదు.

ఇవాళ మాత్రం.. గుంటూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్దఎత్తున సరకు తీసుకువచ్చారు. వచ్చిన సరకులో 80శాతం లావాదేవీలు పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అన్ని రకాల మిర్చికి మంచి ధరలే ఉన్నందున రైతులు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details