ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు: డీఎస్పీ - నరసరావుపేట డివిజన్ డీఎస్పీ ఎం. వీరారెడ్డి ఇసుక వార్తలు

నరసరావుపేట డివిజన్​లో ఎవరైనా ఇసుక అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు పెడతామని డీఎస్పీ ఎం.వీరారెడ్డి అన్నారు. ఇస్సపాలెంలో ఇసుక డంప్ యార్డ్​ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఇసుక అక్రమాలకు పాల్పడితే కేసులు బనాయిస్తాం

By

Published : Nov 16, 2019, 9:37 AM IST

Updated : Nov 16, 2019, 1:31 PM IST

ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్​లో ఇసుక అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ వీరారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఇస్సపాలెంలో ఇసుక డంప్ యార్డ్​ను ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు. ప్రతి ఒక్క భవన నిర్మాణ యజమాని ఆన్​లైన్​లో బుక్​ చేసుకుని ఇసుకను ఇక్కడినుంచి తీసుకువెళ్లే విధంగా ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి ఒక్క వాహనదారుడు వారికి ఇచ్చిన రూట్​లకు మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు. ఇసుకను అక్రమంగా తరలించకుండా చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేశామన్నారు. ఏరియాల ఎస్సైలు అనుమానం వచ్చిన వాహనాలను ఆపితే సరైన పత్రాలు చూపించాలని తెలిపారు. పల్లె ప్రాంతంలో కాలువల వద్ద దొరికే ఇసుకను తహసీల్దార్​ అనుమతి పత్రం తీసుకున్న తరువాతనే తరలించాలని తెలిపారు. మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని డీఎస్పీ అన్నారు.

ఇదీ చదవండి:'దరఖాస్తు చేసుకున్న 2 గంటల్లోనే ఇసుక సరఫరా'

Last Updated : Nov 16, 2019, 1:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details