గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని కర్లపాలెం మండలం పెరలి గ్రామం.. ఫైవ్ స్టార్ గ్రామంగా మెంబర్ అఫ్ పోస్టల్ సర్వీసెస్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ తెనాలి డివిజన్ జె. శ్రీనివాసులు తెలిపారు. పోస్టల్ సర్వీసెస్లో మొట్టమొదటిసారిగా ఐదు నక్షత్రాలు కలిగిన గ్రామంగా గుర్తింపు పొందటం విశేషం.
ప్రధానంగా 5 పథకాల ద్వారా 500 మంది ఖాతాదారులను భాగస్వామ్యం చెయ్యాలి. సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంకింగ్ ఆర్డీ అండ్ ఎస్బీ, ఇండియన్ పేమెంట్ బ్యాంకింగ్, ప్రైమ్ మినిస్టర్ సంరక్షణ బీమా యోజన, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాలు.. ఒక్కొక్కటి వంద మంది చొప్పున పూర్తిగా వినియోగంలో ఉండాలని సూచించారు. ఇలా ఐదు విభాగాలలో 500 మందితో పోస్ట్ ఆఫీస్ సర్వీసులను వినియోగించుకోవటంతో ఆ గ్రామానికి ఫైవ్ స్టార్ గుర్తింపు వచ్చింది.