గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో దారుణం జరిగింది. పెళ్లై మూడు నెలలు గడవకముందే సంతోషిరాణి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తే మద్యానికి బానిసై తమ కుమార్తెను చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సెల్ఫోన్ ఛార్జింగ్ వైరును మెడకు గట్టిగా బిగించి లాగటంతోనే తమ కుమార్తె మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న బాపట్ల డీఎస్పీ మృతదేహాన్ని పరిశీలించారు. మెడ కింద భాగంలో, కుడి చేతి భాగంలోనూ గాయాలు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత మృతి.. అల్లుడే చంపాడని తల్లిదండ్రుల ఫిర్యాదు - అల్లుడే చంపాడని తల్లిదండ్రులు ఫిర్యాదు
పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు. దంపతుల మధ్య మద్యం చిచ్చు రాజేసింది. యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అల్లుడే తమ కూతురిని హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాహిత మృతి