గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెం పంచాయతీలో ఈనెల 9న నామినేషన్ల స్వీకరణ జరిగింది. వైకాపా మద్దుతుదారుడు ప్రసాద్ రెడ్డి నామినేషన్ వేయగా.. అదే గ్రామానికి చెందిన అక్కల వెంకాయమ్మ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రసాద్ రెడ్డి వర్గం.. తనతోపాటు తమకు మద్దుతిచ్చిన గ్రామస్థులపైనా దాడికి దిగినట్లు అభ్యర్థి వెంకాయమ్మ ఆరోపించారు.
'వైకాపా నేతలు దాడులు చేస్తున్నారు... రక్షణ కల్పించండి' - panchayati election nominations
తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని గుంటూరు జిల్లా రాంబోట్లవారిపాలెం సర్పంచి అభ్యర్థి, పలువురు గ్రామస్థులు.. గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీని కోరారు. సర్పంచ్ పదవికి అభ్యర్థిగా పోటీ చేసినందుకు తమపై దాడికి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైకాపా నేతలు దాడులు చేస్తున్నారు
దీనిపై చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రమేశ్.. ప్రసాద్ రెడ్డికి అండగా నిలిచి తమనే వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రసాద్ రెడ్డి, అతని అనుచరులు నుంచి రక్షణ కల్పించాలని భాదితులు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేస్తామని భరోసా ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఇదీ చూడండి:కాకినాడ కార్పొరేటర్ హత్య.. పాత కక్షలే కారణం