ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐ అధికారుల విచారణకు సంబంధించి రీ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయ్యింది. పంచనామా వ్యవహారంలో తెనాలి ఎమ్మార్వో రవిబాబు పాల్గొన్నారు. సీబీఐ అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీబీఐ తదుపరి విచారణ జరుగుతుందన్నారు. సీబీఐ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్లు ఆయేషా మీరా తండ్రి తెలిపారు. ఆయేషా హత్య కేసులో అసలు నిందితులను పట్టుకోవడం ద్వారా సమాజానికి న్యాయం చేయాలన్నారు. దిశ చట్టం ఒక బోగస్ చట్టమని... 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యం కాదన్నారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయండి.. రాజకీయాల కోసం కాదని ఆయన సూచించారు.
'ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయండి.. రాజకీయాల కోసం కాదు'
ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐ అధికారుల విచారణకు సంబంధించి రీ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయ్యింది. ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించారు. వాటిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై అయేషా మీరా తండ్రి స్పందించారు.
'ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయండి.. రాజకీయాల కోసం కాదు'