ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురజాలలో పెరుగుతున్న కేసులు.. 16 నుంచి పూర్తి లాక్​డౌన్​ - corona cases in gurajala news update

ఈనెల 16 నుంచి గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో లాక్​డౌన్ ప్రకటిస్తున్నట్లు ఆర్డీవో పార్థసారథి వెల్లడించారు. పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లాలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

RDO review meeting
గురజాలలో పెరుగుతున్న కరోనా కేసులపై ఆర్డీఓ సమీక్ష

By

Published : Jul 15, 2020, 3:15 PM IST


గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈనెల 16 నుంచి డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో లాక్​డౌన్ ప్రకటిస్తున్నట్లు ఆర్డీవో పార్థసారథి వెల్లడించారు. పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లాలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు సహకరించకుండా.. నిబంధనలు ధిక్కరిస్తే ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆరోగ్య, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

తెనాలిలో తగ్గని కరోనా ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details