ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖలో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరుగుతోంది' - రాజధానిపై స్పందించి రాయపాటి

రాజధాని మార్పు ప్రతిపాదనలను.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యతిరేకించారు. 3 రాజధానులతో అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు.

rayapti comments on capital issue
అమరావతే రాజధానిగా కొనసాగించాలంటున్న రాయపాటి

By

Published : Jan 4, 2020, 1:55 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్న రాయపాటి

రాజధానిగా అమరావతే ఉండాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని అభిప్రాయపడ్డారు. గుంటూరులో గోగినేని కనకయ్య కాంస్య విగ్రహావిష్కరణకు హాజరైన ఆయన... విశాఖను అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు స్థాపించాలి కానీ.. రాజధానిని మార్చటం సరైన నిర్ణయం కాదని అన్నారు. విశాఖలో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపించారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందిందని చెప్పటం సబబు కాదని చెప్పారు. ఇటీవల తనపై జరిగిన అనిశా దాడుల మీద స్పందించిన ఆయన.. దాడులు జరిగిన మాట వాస్తమేనని... తనిఖీలు చేసి వెళ్లారని వివరణ ఇచ్చారు. తనకు ఎటువంటి ఈడీ నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details