ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జెండా దిమ్మను కూల్చినవారిపై చర్యలు తీసుకోవాలి' - తెనాలిలో భాజాపా జెండా దిమ్మ ధ్వంసం న్యూస్

గుంటూరు జిల్లా నందివెలుగులో భాజపా జెండా దిమ్మను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రావెల కిశోర్​బాబు డిమాండ్ చేశారు. భాజపా శ్రేణులతో కలిసి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న జెండా దిమ్మను కూలుస్తారా?
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న జెండా దిమ్మను కూలుస్తారా?

By

Published : Oct 30, 2020, 4:49 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు భాజపా శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. గ్రామంలోని భాజపా జెండా దిమ్మను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న జెండా దిమ్మను కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కిశోర్​బాబుతో మాట్లాడారు. దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వటంతో ఆయన ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details