గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాచర్ల నుంచి కాకినాడకు రెండు లారీల్లో అక్రంగా తరలిస్తున్న 600 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు లారీలను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
600 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - రేషన్ బియ్యం పట్టివేత
రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 600 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి లారీలు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
600 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత