గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులోని ఓ పత్తి మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మిల్లు అద్దెకు తీసుకున్న ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌర సరఫరాల అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే గోదాముల నుంచి యూరియా సంచుల్లోకి బియ్యాన్ని నింపి విక్రయించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - police
గుంటూరు జిల్లా చింతపల్లిపాడులో ఓ పత్తిమిల్లులో పౌరసరఫరాల అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.
రేషన్ బియ్యం