విజయవాడ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వడ్లపూడికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి మినీ లారీలో 18 క్వింటాళ్ల బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తెనాలి రోడ్ లో తనిఖీలు నిర్వహించారు.
వడ్లపూడిలోని ఓ రైస్ మిల్లుకు గత కొంతకాలంగా అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఓ వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలోని ద్వారకానగర్ లో అక్రమంగా తరలిస్తున్న మరో 7 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.