మూడో విడత రేషన్ పంపిణీ చేయలేమని..వృత్తి కన్నా తమ ప్రాణాలే ముఖ్యమని రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షుడు లీలా మాధవరావు అన్నారు. మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ విధానంలో ప్రతి కార్డుదారులు వేలిముద్రలు వేయాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. వేలిముద్రలు ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని... ప్రభుత్వం ఒకసారి గమనించి గత నెలలో రెండుసార్లు ఎలా పంపిణీ చేసాము అలాగే చేస్తామని రేషన్ డీలర్లు అంటున్నారు.
వేలిముద్రలతో మూడో విడత రేషన్ ఇవ్వలేం : డీలర్ల సంఘం - korona news
వేలిముద్రలు వేయటం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున...తాము మూడో విడత రేషన్ ఇవ్వలేమని రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు లీలా మాధవరావు అన్నారు.
రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు లీలా మాధవరావు